ఘనంగా జరిగిన తెలంగాణ రాష్ట్ర భాషా దినోత్సవం
కెన్నడీ హై ద గ్లోబల్ స్కూల్ నందు 09.09.2024 సోమవారం నాడు కాళోజి నారాయణ రావు గారి జయంతిని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర భాషా దినోత్సవ వేడుకలు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ముఖ్య అతిధులుగా అధ్యక్షులు బి.హెచ్.సుబ్భారెడ్డి గారు, మేనేజింగ్ డైరెక్టర్, కమాండర్ ఎన్. కృపాకర్ రెడ్డి గారు, అకడమిక్ డైరెక్టర్, ప్రిన్సిపల్ రాజ్యలక్ష్మి భట్ గారు విచ్చేశారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా బి.హెచ్.సుబ్భారెడ్డి గారు ప్రసంగిస్తూ తెలుగులో గొప్ప గొప్ప కవులు రచించిన పుస్తకాలు చదవడం వలన తెలుగు భాషపై పట్టు దొరుకుతుందని, నీతి పద్యాలు నేర్చుకోవడం అలవాటు చేసుకోమని విద్యార్థులకు తెలియచేసారు. మేనేజింగ్ డైరెక్టర్, కమాండర్ ఎన్. కృపాకర్ రెడ్డి గారు ప్రసంగిస్తూ అమ్మ,నాన్న, అత్త, మామ అనే పదాలలోనే అత్మియతా ద్వనిస్తుందనీ, సంస్కృతి సంప్రదాయాలతో ముడి పడిన భాష మన తెలుగు భాష అని, మన భాషను గౌరవించడం మన ప్రథమ కర్తవ్యం అన్నారు. ప్రిన్సిపల్ రాజ్యలక్ష్మి భట్ గారు మాట్లాడుతూ తెలంగాణ యాస శాస్త్రీయమైనదనీ, గ్రాంథికానికి దగ్గరగా ఉండే భాష అని ఉపన్యసించారు. తరువాత జరిగిన సంస్కృతిక కార్యాక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి.